![]() |
![]() |

'చెఫ్ మంత్రం' సీజన్ 2 మంచి రెసిపీస్ తో అప్పుడప్పుడు కొన్ని నవ్వులతో, సరదాగా సాగిపోతోంది. ఇక ఈ వారం మంచు లక్ష్మి హోస్ట్ చేస్తున్న ఈ షోకి నిహారిక కొణిదెల, కాలభైరవ వచ్చారు. ఇక నిహారిక, కాలభైరవ ఫ్రెండ్‌షిప్ గురించి అడిగేసరికి "కాలభైరవ, నేను స్కూల్ నుంచి ఫ్రెండ్స్. నేను థర్డ్ క్లాస్ చదివేటప్పుడు నా పెన్సిల్ కింద పడిపోయింది. దాన్ని తీసుకుంటున్నప్పుడు భైరవ నా వేలిని తొక్కేసాడు. అది నాకు బాగా గుర్తు. ఆ తర్వాత థర్డ్ క్లాస్ మిడిల్ నుంచి భైరవ స్కూల్ లోంచి వెళ్ళిపోయాడు. నేను అదే స్కూల్లో ఉన్నాను. తర్వాత కట్ చేస్తే మళ్ళీ డిగ్రీ లో సేమ్ కాలేజీలో కలిసి చదువుకున్నాం." అని చెప్పింది నిహారిక.
"కాలభైరవ పేరు వెరైటీగా ఉంది. అలాంటి పేరు పెట్టారేమిటి దాని వెనక రీజన్ ఏంటి?" అని లక్ష్మి అడిగేసరికి, "నా పేరును మా తాతగారు, నాన్నగారు కలిసి పెట్టారు. శివుడికి మరో పేరు ఈ కాలభైరవ. నేను పుట్టే సమయానికి మా నాన్నగారు కాలభైరవ అష్టకమ్ రికార్డింగ్ లో ఉన్నారు. ఇక అదే టైములో నేను ఈ భూమ్మీదకు వచ్చానని నాకు ఆ పేరు పెట్టారు" అని చెప్పాడు.
ఇక ఆయనతో ఈ చెఫ్ మంత్రం సీజన్ 2 షోలో ఒక సాంగ్ పాడించింది మంచు లక్ష్మి. "మా నాన్నకు నేను సింగర్ ని కావాలని ఉండేది కానీ నేను సింగర్ ని కాలేదు" అని చెప్పింది మంచు లక్ష్మి.
![]() |
![]() |